బండి సంజయ్‌కు తులాభారం

దిశ, న్యూస్‌బ్యూరో: తన తులాభారంలో వచ్చిన నిధిని భైంసా బాధితులకు అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ కుమార్ ప్రకటించారు. ఆయన అభిమానులు సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన బరువును తూకం వేసి నాణేలతో కొలిచారు. భైంసా బాధితులు వినూత్నంగా తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన తెలిపారు. ఎంఐఎం వల్లే భైంసాలో హిందూవులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారిపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి యువకులపై కేసులు పెట్టారని తప్పుబట్టారు. గత ఆదివారం కూడా యువకులపై కేసులు పెట్టారని సంజయ్ తెలిపారు.

Advertisement