ఎంఐఎం పార్టీ మెప్పు కోసం టీఆర్ఎస్ కృషి

దిశ, పటాన్‌చెరు: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్ డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ , సభ్యులు ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్బంగాచ రవీందర్ మాట్లాడుతూ… తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ఇపుడు ఎంఐఎం పార్టీ మెప్పు పొందడానికి అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహిస్తుంటే, తెలంగాణలో మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారని వాపోయారు.

Advertisement