- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ నుంచి ‘పీవీ’ని లాగేసుకున్న బీజేపీ.. ఎలా ?
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ అవకాశాన్ని వదులుకోకుండా వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్న బీజేపీ… లేటెస్ట్‌గా టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండి కొడుతూ, టీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. గ్రేటర్ ప్రచారంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్.. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూలగొట్టాలని సంచలన కామెంట్స్ చేయగా.. వాటికి కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్ ఇవాళ సమాధుల వద్ద నివాళులర్పించి మరో కొత్త ఎత్తుగడను తెరపైకి తెచ్చారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన సంజయ్.. ఏపీ బీజేపీతో కలిసి పోరాడుతామని లాజిక్‌గా మాట్లాడారు.
జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తే హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాసులతో పాటు, టీడీపీ ఓటర్లను ఆకట్టుకోవచ్చనే కొత్త స్ట్రాటజీని అమలు చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో సైతం తీర్మానం చేసి పంపారని, ఆ విషయం గుర్తుండి కూడా ఎందుకు ఇప్పుడు ఎన్టీఆర్‌కు భారతర్నత ఇవ్వాలన్న అంశాన్ని తెరపైకి తెస్తుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయ. ఇప్పటికీ కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉందని, వారు తలచుకుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చి తీరుతుందని, కేవలం హైదరాబాద్ ఓట్ల కోసమే బీజేపీ.. ఎన్టీఆర్ పేరును వాడుకుంటోందన్న చర్చ జరుగుతోంది.
మరోవైపు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరును రాజకీయ లబ్ది కోసం టీఆర్ఎస్ క్యాచ్ చేసుకుందన్న ప్రచారం ఉంది. అందుకే పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ కాంగ్రెస్‌కు ఎత్తులు వేస్తున్నారని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. గతంలోనూ తెలంగాణ అసెంబ్లీలో పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. కానీ ఇప్పుడు కావాలనే పీవీ పేరును ఎత్తుకున్న బీజేపీ.. ఆయన సమాధి వద్ద కాపల ఉంటామంటూ టీఆర్ఎస్ వద్ద నుంచి పీవీ పేరును లాగేసుకోవడమే గాక.. అటు కాంగ్రెస్, పీవీ అభిమానుల ఓట్లను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకుల నుంచి వినపడుతోన్న మాట.
దుబ్బాక విజయం తర్వాత.. టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఏం మాట్లాడినా అందులో లాజిక్ పాయింట్లను పడుతున్న బీజేపీ… ఎలాగైన గ్రేటర్‌లో కాషాయం జెండా ఎగరవేసేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటోంది. వరదసాయంపై ఈసీకి ఫేక్ సంతకం విషయం నుంచి మొదలు, పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్, దారుసలాం కూల్చుతామనడం, ఇప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్నతో పాటు, పీవీ సమాధి దగ్గర కాపల ఉంటామని.. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ గెలుపే లక్ష్యంగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోందన్న చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పీవీ నరసింహారావును బీజేపీ ఎందుకు ఓన్ చేసుకుంటోంది, అసలు బీజేపీకి ఏ సంబంధమన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో తిరుగుతోంది.