పోలవరంపై విచారణ జరిపించాలి : వీర్రాజు

by srinivas |   ( Updated:2020-11-12 03:36:36.0  )
పోలవరంపై విచారణ జరిపించాలి : వీర్రాజు
X

దిశ, వెబ్‌‌‌డెస్క్: పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేంద్రం అధ్యయనం చేసి, ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తుందని అని వెల్లడించారు. గతంలో వేసిన కమిటీ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనేజ్ చేశారని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంపై అనుమానాలున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపి డబ్బులు ఇచ్చారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed