ఆలయాల దాడుల వెనుక 'చంద్రబాబు' హస్తం

by srinivas |
Subramanian swamy
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ నేత చంద్రబాబు హస్తం ఉంఉండొచ్చని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే అక్కసుతో కొందరు ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం సీఎం జగన్‌ను క్రైస్తవుడని ముద్ర వేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్‌ తిరుమలలో తెల్లవారుజామున 2 గంటలకు పూజలు చేశారు. కానీ, ఆయన దాన్ని తన ప్రచారం కోసం వాడుకోలేదని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. టీటీడీ ఆస్తుల లెక్కలను కాగ్‌కు అప్పగిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నదంతా చంద్రబాబు కుట్రేనని అన్నారు. టీటీడీలో క్రైస్తవులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారన్నారు. టీటీడీలో కేవలం ఏడుగురే అన్య మతస్తులు ఉన్నారని.. వారు కూడా అంతకు ముందు ప్రభుత్వంలో నియమితులైనవారేనని స్పష్టం చేశారు.

Advertisement

Next Story