- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘జీవన్‌రెడ్డి అంటే నాకిష్టం.. ఆయన మా అంకుల్’
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని అడ్డుకునే సత్తా ఏ పార్టీకీ లేదన్నారు. శనివారం జగిత్యాలలో పర్యటించిన అర్వింద్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకూ టీచర్ల సమస్యలు పరిష్కారం కాలేవు అని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీచర్ల సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా ప్రస్తుతం రాష్ట్రాన్ని ఐదుగురు ముఖ్యమంత్రుల పాలిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయినా… జగిత్యాలలో ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా పీసీసీ రేసులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టం అని.. ఆయన మా అంకుల్ అని అర్వింద్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని..వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏకమై పోటీ చేస్తారని ఎంపీ అర్వింద్ జోస్యం చెప్పారు.