- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే చేసిన పనికి ‘షాక్’లో డాక్టర్లు.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యే చేసిన పని వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. గుజరాత్ సూరత్‌లోని సర్తానా ప్రాంతంలో బీజేపీ నేతలు ఓ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కాగా, ఈ ఐసోలేషన్ కేంద్రానికి కామ్‌రాజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీడి ఝలవాడియా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన కరోనా రోగికి రెమిడెసివర్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదో తరగతి విద్యార్హతలు ఉన్న అతను.. కరోనా రోగికి టీకా ఎలా వేస్తారని కాంగ్రెస్ నేతలు అతడిని టార్గెట్ చేశారు. పబ్లిసిటీ కోసమే కరోనా రోగులకు ఇంజెక్షన్వేస్తూ ఫొటో సెషన్పెట్టుకున్నారని విమర్శించారు.
తాజాగా ఈ వీడియోపై ఎమ్మెల్యే ఝలవాడియా స్పందిస్తూ.. తాను కరోనా బాధితుడికి ఇంజెక్షన్వేయలేదని కెమికల్ లిక్విడ్ మిక్స్ మాత్రమే చేశానని అన్నారు. కరోనా రోగులకు రెమిడెసివర్ ఇచ్చి హాని తలపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఇంజెక్షన్ వేసే సమయంలో తన పక్కన 10 మంది వైద్యులు ఉన్నట్టు పేర్కొన్నారు.