మళ్లీ గుడి కట్టకపోతే నిజాంకు పట్టిన గతే..

by Shyam |
మళ్లీ గుడి కట్టకపోతే నిజాంకు పట్టిన గతే..
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా పాత సచివాలయాన్ని కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సచివాలయంలోని అమ్మవారి గుడిని కూల్చేంత అవసరం ఏముందని రాజాసింగ్ ప్రశ్నించారు. ఆ గుడిని కేసీఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం నిర్మించలేదని.. ఆ గుడి నిజాం కాలం నాటిదని గుర్తు చేశారు. అలా ఎలా గుడిని పడగొడతారని రాజసింగ్ మండిపడ్డారు. కూల్చేసిన స్థానంలో కొత్త ఆలయాన్ని నిర్మించపోతే.. సర్వ నాశనం అవుతామని మన పూర్వీకులు చెప్పారన్నారు. లేకపోతే నిజాంకు పట్టిన పరిస్థితే.. కేసీఆర్‌కు పడుతుందని రాజాసింగ్ వ్యాఖ్యనించారు.

Advertisement

Next Story