- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ వద్ద సబ్జెక్ట్ లేదు.. గ్రాఫ్ పడిపోతుందనే ధర్నాలు: రాజాసింగ్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ వద్ద సబ్జెక్ట్ లేదంటూ బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గురువారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాపై స్పందించిన ఆయన.. కేసీఆర్‌కు మైండ్ పనిచేయడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెంటల్‌గా డిస్ట్రర్బ్ అయ్యారని.. అందుకే ధర్నాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఒక గింజ మిగలకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం ఎంతవరకు ధాన్యం కొనుగోలు చేయాలో అంత వరకు చేస్తోందని.. ఆ విషయం టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా తెలుసన్నారు. కానీ, కేవలం కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందన్న ఆందోళనతో ధర్నాలు చేయడం సరికాదన్నారు రాజాసింగ్.
raja singh on cm kcr dharna@narendramodi pic.twitter.com/RVS5joC7ZX
— MADEPIDDIMAHESH (@madepiddimahesh) November 18, 2021