అప్పుడు లౌకికవాదం గుర్తుకురాలేదా

by Shyam |
అప్పుడు లౌకికవాదం గుర్తుకురాలేదా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీ అయోధ్య రామమందిర భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావడంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అధికారంలో ఉండి ఇటువంటి కార్యక్రమాలకు హాజరుకావడం రాజ్యంగా విరుద్ధం అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, అసదుద్దీన్ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. ప్రధాని మోదీ అయోధ్య పర్యటన చేయడం.. అసదుద్దీన్ రాజ్యాంగ విరుద్దమంటున్నారన్నారు. అయితే, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ ఇఫ్తార్ పార్టీకి వెళ్లేవారని అప్పడు ఎందుకు లౌకికవాదం గుర్తుకు రాలేదని రాజా సింగ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. భవిష్యత్తులో కాశీ, మధురలో కూడా మందిరాన్ని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story