- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హరీశ్ రావును తప్పించేందుకు కుట్ర’
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ పుట్టిన సిద్దిపేటలో, చదువుకున్న దుబ్బాక నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురుతుందని నమ్మడానికి.. దుబ్బాక ఉపఎన్నిక తొలి రోజుల్లో ఎవరు సిద్ధంగా లేరని ఎమ్మెల్యే రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన పై విమర్శలకు దిగారు. ముఖ్యంగా హరీశ్‌రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
‘ఎవరో ట్రబుల్ షూటర్ అని.. వారంటే ట్రబుల్స్ దూరం పోతాయని.. వారే పార్టీ, పార్టీ అంటేనే వారని.. వారుంటే సమస్యలు ఉండవని హరీశ్ రావును ఉద్దేశిస్తూ రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. కానీ, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే ఆయన సమస్య అయ్యారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ట్రబుల్ షూటర్‌ను బయటకు పంపేందుకు కుట్ర చేస్తున్నారా? అని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ వ్యవస్థలను చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారన్నారు. ముఖ్యంగా పోలీసు డిపార్టుమెంటును తనవైపు తిప్పుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సిద్ధిపేట గడ్డ మీద ఖాకీలు.. పింకీ దుస్తులు ధరించారన్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కాషాయ నేతల పై అక్రమ అరెస్టులు చేసిన సీపీలకు ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు హెచ్చరికలు చేశారు. చట్టాలు చుట్టాలునుకుంటున్న వారికి చట్ట ప్రకారమే శిక్ష తప్పదన్నారు. ఎక్కడైతే బీజేపీ నేతలకు అణచివేశారో అక్కడే తనను ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. దుబ్బాకలో ఏ విధంగా అయితే బీజేపీ జెండా ఎగురవేశారో అదే విధంగా జీహెచ్ఎంసీలో కూడా ముందుకు రావాలని గ్రేటర్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.