- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో నాకు సర్కార్ సమయమివ్వకపోతే..
దిశ, తెలంగాణ బ్యూరో: శాసనసభ బడ్జెట్ సెషన్స్‌లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తాను మాట్లాడేందుకు సర్కార్ సమయమివ్వకపోతే ఒక సభ్యుడిగా తనకున్న హక్కుల ప్రకారం నడుచుకుంటానన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రఘునందన్‌రావు రాజాసింగ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ భృతి, పీఆర్సీ, భైంసా అల్లర్లు, మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల సమస్యలను సభలో సర్కార్‌ను నిలదీస్తామన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు రాలేదని టీఆర్ఎస్ నాయకులు చెప్పడం సరికాదన్నారు. రాష్ట్ర బీజేపీ నేతల సూచన మేరకు కేంద్రం తెలంగాణకు రూ.1.50 లక్షల కోట్లు మంజూరు చేయడంతోనే నేషనల్ హైవేస్‌లో పురోగతి సాధ్యమైందన్నారు.