- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రలోభాలకు చెక్
గ్రేటర్‌పోరులో ప్రచారం ముగిసీముగియగానే ప్రలోభాల పర్వం మొదలైంది. వీటికి కొన్నిచోట్ల ఓటర్లే అడ్డు గోడగా నిలవడం విశేషం. అధికార పార్టీ నుంచి పంపిణీ అవుతున్న కట్టల ప్రవాహాన్ని స్థానికులే అడ్డుకుంటున్నారు. గులాబీ శ్రేణులను రోడ్డుకీడుస్తున్నారు. ప్రలోభాలకు లొంగబోమంటూ తెగించి చెబుతున్నారు. పోలీసులపై నమ్మకం లేక బీజేపీ నాయకులకు, ఎన్నికల సంఘం నిఘా బృందాలకు సమాచారమిస్తున్నారు. అనంతరమే పోలీసుల దృష్టికి తీసుకెళ్లున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ యువకుడు చేతిలో రూ.500 నోట్ల కట్టలతో సరూర్ నగర్కార్పొరేటర్తరుపున కాలనీలోకి వచ్చాడు. ఓటరు స్లిప్పులు, కరపత్రాలతోపాటు నోట్లను పంపిణీ చేసేందుకు ప్రయత్నించాడు. స్థానిక యువకులు కొందరు అతడిని పట్టుకుని అధికారులకు అప్పగించారు. అందకు ముందే బీజేపీ నేతలకు, ఎన్నికల సంఘానికి, పోలీసులకు సమాచారమిచ్చారు. జగద్గరిగుట్ట టీఆర్ఎస్అభ్యర్థి అనుచరులు సంజయ్‌పురి కాలనీలో డబ్బులు పంచుతూ దొరికిపోయారు. ఇక్కడ ఓటర్లు నేరుగా బీజేపీ అభ్యర్థికి ఫోన్ చేసి చెప్పడంతో ఆ పార్టీ నేతలు వచ్చి పట్టుకున్నారు. యూసఫ్ గూడలో టీఆర్ఎస్నేతలు ఇంటింటికీ తిరిగి ఓటరు స్లిప్పులు, డబ్బులు పంచుతూ చిక్కారు. స్థానికులు ప్రతిపక్ష పార్టీలకు, అధికారులకు సమాచారమిచ్చారు. ఇక్కడ కూడా రూ.500 కోట్ల కట్టలు, కరపత్రాలు దొరికాయి. టీఆర్ఎస్ రహమత్‌నగర్ కార్పొరేటర్ అభ్యర్థి సీఎన్ రెడ్డి అనుచరులు ఇంటింటికీ తిరిగి డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు దొరకబట్టి అధికారులకు అప్పగించారు. అంతకు ముందే నగదు పంచుతున్న టీఆర్ఎస్ నాయకులను స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని గొడవకు దిగారు. టీఆర్ఎస్ నాయకులు నగదు పంచుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.
తీర్పు మారుతోందనే
నోట్లు పంచుతూ దొరికినవారు అధికార పార్టీ నేతలే కావడం గమనార్హం. ఓటరు తీర్పు మారుతుందనే సంకేతాలతో ఓట్ల కొనుగోలుకు తెగించారని అంటున్నారు. పోలీసులు కూడా సపోర్టుగా నిలుస్తుండటంతో బహిరంగంగానే డబ్బులు పంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మేరకు ఈ ప్రలోభాల పర్వం జోరందుకుంది. ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు, వారి తరుపున పార్టీ నేతలు ఇదే పని మీద ఉన్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ తరుపున అంగన్వాడీ సిబ్బందిని రంగంలోకి దింపారు. యూసఫ్‌గూడ పరిధిలో నగదు పంపిణీ చేస్తుండగా అంగన్వాడీ మహిళలను పట్టుకున్నారు. కృష్ణనగర్‌లో కూడా అంగన్వాడీ ఆయాను పట్టుకున్నారు. వెంకటగిరిలో రూ.25 వేలు, కృష్ణనగర్‌లో రూ.50 వేలను పంపిణీ చేసినట్లు ఆయా వెల్లడించింది. వారిని పోలీసులకు అప్పగించారు. గతంలో ఇలా పంచితే అధికారులు పట్టుకునేది. లేకుంటే ప్రతిపక్షాలు, అభ్యర్థులు ఫిర్యాదు చేసేవారు. ఓటర్లు మాత్రం డబ్బులు తీసుకుని వేయాల్సినవారికి ఓట్లేసేవారు. ఈసారి పరిస్థితి మారింది. నేతలను వారే పట్టుకుని నిలదీస్తున్నారు. దీంతో గులాబీ నేతల్లో ఆందోళన మొదలైంది. పాత బోయిన్ పల్లిలో బీజేపీ అభ్యర్థి ఏనుగుల తిరుపతి డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నరసింహయాదవ్ బావమరిది రాజుయాదవ్ తన అనుచరులతో అక్కడికి చేరుకొని నానా హంగామా సృష్టించారు. తీరా తిరుపతి డబ్బులు పంచడంలేదని తేలడంతో అక్కడి నుంచి టీఆర్ఎస్ నాయకులు వెళ్లిపోయారు. సీతాఫల్ మండిలో డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ నాయకుడిపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమయం లేదు
పోలింగ్‌కు ఒక రోజు సమయం మాత్రమే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెర తీశాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్, టీడీపీ, వామపక్ష పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచే డబ్బుల పంపిణీ షురూ చేశాయి. వేల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇప్పటి వరకూ రోజు భోజనం, బీరు, బిర్యానీ, డబ్బులతో హోరెత్తించిన పార్టీలు ఇప్పుడు నేరుగా ఓటర్లకు డబ్బులను పంపిణీ చేస్తున్నాయి. కొందరు గట్టుచప్పుడు కాకుండా తమ పార్టీకి చెందిన ఇతర జిల్లాల నుంచి రప్పించినవారితో ఓటర్లకు డబ్బులను పంపిణీ చేయిస్తున్నారు. బస్తీలు, మురికివాడలు, కాలనీలలో డబ్బుల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. డబ్బులు పంపిణీ చేస్తున్న అంశాలపై బస్తీల్లో నుంచి కూడా ఫిర్యాదులు వస్తుండటంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీస్తున్నారు. అధికార పార్టీ సగటున రూ. రెండు కోట్ల వరకు నగదు పంపిణీని టార్గెట్‌గా పెట్టుకుందని అంటున్నారు. ఈ వ్యవహారమంతా డివిజన్ ఇన్చార్జుల చేతుల మీదుగా సాగుతోంది.