కేసీఆర్ నియోజకవర్గంలోనే భూ సమస్యలు

by  |
కేసీఆర్ నియోజకవర్గంలోనే భూ సమస్యలు
X

దిశ, హుస్నాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వేదికల నిర్మాణానికి దళితుల భూములు కావాల్సి వచ్చిందా అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపరట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఒక్కవైపు రైతు రాజ్యమని గొప్పలు చెప్పుకుంటూనే మరోవైపు రైతుల ఆత్మహత్యలకు కారణమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే భూ సమస్యలు పెరిగిపోతుంటే వాటిని పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులే దళితుల భూములను అభివృద్ధి పేరుతో స్వాధీనం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికి నేడు ఉన్న భూములను సైతం లాక్కుంటుందని మండిపడ్డారు. దళిత రైతు మృతికి సంతాపం తెలిపేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి మృతి చెందిన రైతు కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్, అక్కన్నపేట, మద్దూర్, కోహెడ, బెజ్జంకి మండల మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story