- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలి.. కౌన్సిలర్లను బర్తరఫ్ చేయాలి
దిశ, మంచిర్యాల: చెన్నూర్ పట్టణంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు విద్యుత్ ఉద్యోగులపై దాడి చేయడమే కాకుండా, వారిపై అట్రాసిటీ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ గత ఆరు రోజులుగా జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు దీక్ష చేస్తోన్న సంగతి తెలిసిందే. సోమవారం దీక్షా శిబిరాన్ని సందర్శించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అండదండలతోనే టీఆర్ఎస్ నాయకులు ఉద్యోగులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగులపై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ.. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు రెచ్చిపోతున్నారని అన్నారు. ఈ దీక్షలో పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, మల్లారెడ్డి, రంగారావు, శ్రీనివాస్, రమేష్, ఆంజనేయులు, వెంకటకృష్ణ, శ్రీదేవి, మధుసూధన్ రావు, హరికృష్ణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.