ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా : బీజేపీ నేత

by srinivas |
Subramanian swamy
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రజ్యోతి దినపత్రికపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీటీడీ పరువుకు భంగం కలించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు స్పష్టం చేశారు. తిరుమల స్వామి వారి ఆలయంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు.

చంద్రబాబు నాయుడు తమను కాపాడతారన్న భావనలో ఆంధ్రజ్యోతి ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఒక బాలాజీ భక్తుడిగా పోరాటం చేసేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. కుట్రపూరితంగానే టీటీడీపీపైనా.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు పరువునష్టం దావా వేశానని అందుకు వాదించేందుకు లాయర్ ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ పరువు నష్టం దావా కేసు ఓడిపోలేదని ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement

Next Story