- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతి బరిలో ఉమ్మడి అభ్యర్థి : వీర్రాజు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ… తిరుపతిలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాం అని తెలిపారు. హిందూ దేవాలయాలపై, ఆస్తులపై ప్రభుత్వం కన్ను పడిందని అన్నారు. కాగా, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోటీపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు జనసేనతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తిరుపతి బరిలో నిలబడేది తామేనని జనసేన ఒక వైపు చెబుతుంటే, తాము పోటీ చేయబోతున్నామని ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల్లో అయోమయం నెలకుంటోంది. తాజాగా వీటికి చెక్ పెడుతూ.. ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతున్నామని, ఇరు పార్టీల కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
Advertisement
Next Story