- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చంద్రబాబు నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: చంద్రబాబు నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉంటారని.. తనకు జీతం ఇవ్వాలో లేదో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. చంద్రబాబుపై పిల్ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. తిరుపతి లోక్సభ ఉపఎన్నికలపై జనసేన పార్టీతో కలిసి ముందుకెళ్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అభ్యర్థి ఏ పార్టీ అయినా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఎవరుంటే అధికారులు, పోలీసులు వారి మాట వింటున్నారని విమర్శించారు. ప్రతిపక్షం మీద కేసులు పెట్టమంటే పోలీసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ మీద కూడా తప్పుడు కేసులు పెట్టారన్నారు. అధికారులు, పోలీసులు తమ ఆలోచనలు మార్చుకోవాలని సోము వీర్రాజు సూచించారు.
Next Story