బీజేపీలో తీవ్ర విషాదం.. లోకుల గాంధీ కన్నుమూత

by srinivas |
BJP leader Lokula Gandhi
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ కన్నుమూశారు. విశాఖ జిల్లా శరభన్నపాలెంకు చెందిన ఆయన గత కొద్దిరోజుల క్రితం డెంగ్యూ జ్వరం బారినపడ్డారు. దీంతో చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌లో చేరాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన పార్టీ నేతలు తీవ్ర విషాదంలో మునిగారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed