ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదు

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంటే ప్రజా ఆరోగ్య వ్యవస్థలను మెరుగు పర్చాల్సిన సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌లో శనివారం సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో కరెంట్ పోతే జనరేటర్‌కు డీజిల్ లేదనడం దారుణమన్నారు.

వందల కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం కరోనా మృతదేహాలను కాల్చడానికి ఎందుకు ఎలక్ట్రికల్ మిషన్స్ కొనటం లేదని విమర్శించారు. ప్రజలు కరోనా టెస్టులు ఎక్కడ చేయించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనాతో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే 50వేల మంది ఇళ్లు గడవక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed