కేసీఆర్‌పైన క్రిమినల్ కేసు పెట్టండి.. బీజేపీ నేత సంచలన డిమాండ్

by Sridhar Babu |
కేసీఆర్‌పైన క్రిమినల్ కేసు పెట్టండి.. బీజేపీ నేత సంచలన డిమాండ్
X

దిశ, మల్యాల: జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలోని అంగడిబజారులో సోమవారం టీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన చావుడప్పు కార్యక్రమంలో మోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం పట్ల బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనం చేసిన ప్రదేశంలోనే మంగళవారం బీజేపీ నాయకులు అర్చకుల చేత సంప్రోక్షణ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు మాట్లాడుతూ.. మోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం టీఆర్ఎస్ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనం అని తెలిపారు. అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు నిర్వహించే కార్యక్రమాలకు ఒక విధంగా.. బీజేపీ నాయకులు నిర్వహించే కార్యక్రమాలలో మరో విధంగా ప్రవర్తించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని దిష్టిబొమ్మ దహనం సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అని ఆరోపించారు. బీజేపీ నాయకులు పల్లెల్లోకి వస్తే తరిమి కొట్టండి అంటున్న కేసీఆర్‌పైన క్రిమినల్ కేసులు పెట్టాలని బింగి వేణు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మల్యాల మండల బీజేపీ కన్వీనర్ బొబ్బిలి వెంకట స్వామి యాదవ్, గాజుల మల్లేశం, ఎంపీటీసీలు రాచర్ల రమేష్, సంఘాన్ని రవి, బొట్ల ప్రసాద్, ముదిగంటి రాజు, పి రాజశేఖర్, జనగం రాములు, నేరెళ్ల శ్రావణ్ కుమార్, నులుగోండ సురేష్ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story