- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూల్చినప్పుడు మేమే.. కట్టేటప్పుడూ మేమే.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన సమయంలోనే గాక దాని స్థానంలో భవ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడూ రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉన్నదని వ్యాఖ్యానించారు. లక్నోలోని బీజేపీ ఆఫీస్ బేరర్లతో జరిగిన సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘అయోధ్యలో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చినప్పుడు రాష్ట్రంలో బీజేపీ (1992) అధికారంలో ఉంది. అప్పుడు కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతేగాక ఇక్కడ రామమందిరానికి పునాదిరాయి వేసేప్పుడు కూడా బీజేపీనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది నిజంగా యాధృశ్చికం..’ అని అన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల పోరాటంపై రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. రైతులు చర్చలకు రావాలని కోరారు. గతంలో తాము హామీ ఇచ్చిన విధంగా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సాగు చట్టాలలోని ఒక్కో క్లాజుపై చర్చించడానికి.. రైతులకు అభ్యంతరాలు ఉంటే వాటిని సవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.