- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాధ్యతల స్వీకరణకు ముహుర్తం ఫిక్స్..
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణకు ముహుర్తం కుదిరింది. వచ్చే మంగళవారం ఉదయం ఆయన చార్జ్ తీసుకోనున్నారు. విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగనుందని పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి తెలిపారు. ఇటీవలే ఆయన్ను కేంద్ర నాయకత్వం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు అఖిల భారత సంఘటన్ సహ కార్యదర్శి సతీష్ జీ అతిథిగా విచ్చేయనున్నట్లు సమాచారం. సోము వీర్రాజు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను వామరాజు సత్యమూర్తి, రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జి సునీల్ దియోడర్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ తదితరులు చూస్తున్నారు.
Next Story