బీజేపీ చేతిలో ఓడిపోయారు..ఆ ఎమ్మెల్యేల పరిస్థితి?

by Shyam |
బీజేపీ చేతిలో ఓడిపోయారు..ఆ ఎమ్మెల్యేల పరిస్థితి?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాలను కోల్పోతోంది. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల బంధుగణం ఘోరంగా ఓటమి పాలవుతోంది. దీంతో ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటనే చర్చ రాజకీయవర్గాల్లో గుసగుసలువినిపిస్తున్నాయి. ముషీరాబాద్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఉప్పల్, కంటోన్మెంట్, సనత్‎నగర్ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.

ఎల్బీనగర్‌లో 11 డివిజన్‌లు ఉంటే కేవలం ఒక్క బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోనే టీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన డివిజన్లు అన్ని బీజేపీ దక్కించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన సుధీర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. కానీ, గ్రేటర్ ఎన్నికల్లో తమదైన ముద్ర వేసుకోవడంలో విఫలమైయ్యారు. అదేవిధంగా గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్ధి భర్త ముద్దగౌని రాంమోహాన్ గౌడ్ ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచి ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ భార్యను కార్పొరేటర్‌గా గెలిపించుకోవడంలో సఫలమైయ్యారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి పరిస్థితి పార్టీలో అగమ్యగోచరంగా మారింది.

అలాగే ముషీరాబాద్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిధిలోని డివిజన్లలో ఒక్క స్ధానాన్ని కూడా గెలిపించుకోలేకపోయారు. ఉప్పల్ నియోజకవర్గంలో 2 కాంగ్రెస్ దక్కించుకోగా, స్థానిక ఎమ్మెల్యే భార్య బేతి స్వప్నా బీజేపీ చేతిలో ఓటమి పాలైనారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత కవాడిగూడలో ఓడిపోయారు. ఇక సనత్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీ హోరహోరీగా పోరాడుతుంది. దీంతో బీజేపీ 3 స్ధానాలు గెలుచుకుంది… మరో 3 స్ధానాల్లో బీజేపీ, టీఆర్ఎస్ నువ్వా… నేనా అనే విధంగా పోటీ సాగుతుంది. టీఆర్ఎస్ పార్టీలో క్రీయశీలక పాత్ర పోషించే నేతల ఇలాకాలో పరాభావం తప్పలేదు. వీరిపై పార్టీ ఏవిధంగా వ్యవహరిస్తోందో వేచిచూడాల్సి ఉంది.

Advertisement

Next Story