గృహనిర్బంధంలో బీజేపీ, జనసేన నేతలు

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటన నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. బుధవారం చలో అంతర్వేదికి బీజేపీ, జనసేన పిలుపునిచ్చాయి. దీంతో కోనసీమ వ్యాప్తంగా బీజేపీ, జనసేన నేతలను పోలీసులు గృహనిర్భందంలో ఉంచారు.

పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్న కారణంగా అంతర్వేదిలో పర్యటించేందుకు నాయకులకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. మంగళవారం చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న 43 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతర్వేదిలో భారీగా మోహరించిన పోలీసులు ఇతర ప్రాంతాల వారు అంతర్వేదిలో అడుగుపెట్టకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Advertisement