తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణుల ధర్నా

by Sridhar Babu |   ( Updated:2021-12-29 03:23:47.0  )
తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణుల ధర్నా
X

దిశ,తిరుమలాయపాలెం: సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని తిరుమలాయపాలెం మండలం కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు చావా కిరణ్, నున్నా రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story