- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత.. కోడిగుడ్లు, టమాటలతో..
దిశ ప్రతినిధి, వరంగల్ : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. అయోధ్యలో రామమందిరం పేరిట బీజేపీ నేతలు ఇష్టానుసారంగా చందాలు వసూలు చేస్తున్నారంటూ ఆదివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కమలం పార్టీ నేతలు భగ్గుమన్నారు. జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో సాయంత్రం హంటర్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి చల్లా ధర్మారెడ్డి నివాసం వరకు కార్యకర్తలు ర్యాలీగా చేరుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి, చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆవేశానికి లోనైనా కొంతమంది ఎమ్మెల్యే నివాసంపై కోడిగుడ్లు, టమాటలు, రాళ్లు విసిరారు. పోలీసులు వారిస్తున్న వినలేదు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారవడంతో కొద్దిసేపు ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదు. బీజేవైఎం నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి తరలించేందుకు యత్నించారు. అతికష్టం మీద కొంతమందిని అరెస్టు చేసి అక్కడి నుంచి హన్మకొండ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.