‘క్రిప్టో కరెన్సీ’ కాలుష్యానికి తప్పదు భారీ మూల్యం

by Shyam |
‘క్రిప్టో కరెన్సీ’ కాలుష్యానికి తప్పదు భారీ మూల్యం
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం డిజిటల్‌ ట్రేడింగ్‌లో ‘బిట్ కాయిన్’ వంటి క్రిప్టో కరెన్సీ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆది నుంచి చైనా దీన్ని వ్యతిరేకిస్తున్నా, అమెరికా సహా చాలా దేశాలు దీనికి అనుకూలమైన పథకాలను రూపొందిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ చలామణిని ఇండియా అంగీకరించకపోయినా, భవిష్యత్తులో ఆమోదించే అవకాశం లేకపోలేదు. ఆయా దేశాల్లోని కేంద్రీకృత బ్యాంకులపై ఆధారపడకుండా ప్రైవసీగా లావాదేవీలను చేసుకునే అవకాశం ఉండటంతో దీన్ని ‘ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్స్’గా చూస్తున్నారు. ఏదేమైనా ఆర్థిక కోణం నుంచి చూస్తే ‘క్రిప్టో కరెన్సీ’ కచ్చితంగా విప్లవాత్మకమైనప్పటికీ, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది తీవ్రమైన ‘ఈ-వేస్ట్’‌కు కారణంగా నిలుస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివల్ల రాబోయే కాలంలో భారీ కాలుష్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యర్థాలు వాస్తవానికి ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఇది పరిష్కరించగల సమస్యేనా? ప్రజలు ఆందోళన చెందాల్సిన అమసరముందా?

బిట్‌కాయిన్ వ్యవస్థలో మైనింగ్‌ను కేంద్ర వ్యవస్థగా చెప్పుకోవచ్చు. కొత్త బిట్‌కాయిన్‌ల సృష్టి, లావాదేవీలు, పర్యవేక్షణ వంటివన్నీ మైనింగ్‌ కిందకు వస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో వర్చువల్ కరెన్సీ కాగా ఇది కంప్యూటర్ కోడ్‌ల రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ కోడ్స్ ద్వారానే జరుగుతాయి. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ఆన్‌లైన్ లెడ్జర్‌లో యాడ్ అవ్వడానికి ముందే, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ దాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలా బ్లాక్‌చెయిన్‌కు కొత్త బ్లాక్‌ను జోడించడాన్ని లేదా బిట్‌కాయిన్లను సృష్టించడాన్ని మైనింగ్‌ అంటారు.

సాధారణంగా చాలా మంది ప్రజలు బిట్‌కాయిన్ కొనడానికి బదులుగా దాన్ని ‘మైనింగ్’ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది చాలా వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. కొత్త బిట్‌కాయిన్లు సృష్టించడానికి కఠినమైన అల్గారిథమ్స్ పరిష్కరించాల్సి ఉండగా, ఇందుకోసం శక్తిమంతమైన కంప్యూటర్స్ ఉపయోగిస్తారు. వాటి ప్రాసెసర్లను రోజంతా నడుపుతూనే ఉండాల్సి రావడంతో ఇది చాలా వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం వాడే కంప్యూటర్ల సగటు జీవితకాలం 1.3 సంవత్సరాలకు పరిమితం అవడంతో పాటు, మైనింగ్‌కి ఉపయోగించిన తర్వాత కంప్యూటర్లు పనికి రాకుండా పోవడంతో, ఈ ప్రక్రియలో చాలా ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. బిట్‌కాయిన్ ఉపయోగించి నిర్వహించే ప్రతి లావాదేవీ 1.5 ఐఫోన్‌ల బరువుకు సమానమైన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. డేటా సైంటిస్టులు అలెక్స్ డీ వ్రైస్, క్రిస్టియన్ స్టోల్ అంచనాల ప్రకారం ప్రతీ ఏటా క్రిప్టోకరెన్సీ మైనర్లు 30,700 టన్నుల ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుండగా, ఇది నెదర్లాండ్స్‌లో​వార్షికంగా ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు సమానం.

మరో సమస్య అధిక విద్యుత్ :

బిట్‌కాయిన్‌ను మైనింగ్ చేయడానికి, నిర్వహించడానికి అధిక విద్యుత్ అవసరమవుతుంది. మైనింగ్ ఒక ఘనమైన ఆదాయ వనరును అందిస్తున్నందున, ప్రజలు ఒక కాయిన్ పీస్‌ను పొందడానికి గంటల తరబడి ఆల్ట్రా పవర్ యంత్రాలను నడపడానికి సిద్ధపడతారు. ఈ క్రమంలోనే 2017‌లో, బిట్‌కాయిన్ నెట్‌వర్క్ సంవత్సరానికి 30 టెరావాట్ గంటల (TWh) విద్యుత్తును వినియోగించింది. అయితే ప్రస్తుతం డీ వ్రైస్ అంచనాల ప్రకారం.. నెట్‌వర్క్ ప్రస్తుతం 78TWh నుంచి 101TWh మధ్య రెండు రెట్లు ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. అంతేకాదు ప్రతీ బిట్‌కాయిన్ లావాదేవీకి సగటున 300 కిలోల కార్బన్ డయాక్సైడ్ అవసరం. ఇది 750,000 క్రెడిట్ కార్డులు స్వైప్ చేసిన కార్బన్ ఫుట్‌ప్రింట్‌తో సమానం. ఒకవేళ బిట్‌కాయిన్ ఒక దేశం అయితే, అది ఆస్ట్రియా లేదా బంగ్లాదేశ్ కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది.

కార్బన్ ఫుట్ ప్రింట్ :

బిట్‌కాయిన్‌ మైనింగ్‌ వల్ల భారీ శక్తి-వినియోగం ప్రధాన సమస్య అయినా, చాలా మైనింగ్ సౌకర్యాలు బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడే ప్రాంతాలలో ఉన్నాయి. ఇంతకుముందు, మైనర్‌లను ట్రాక్ చేయడం కష్టతరంగా ఉండటంతో.. బిట్‌కాయిన్ నెట్‌వర్క్ కార్బన్ ప్రభావాన్ని గుర్తించడం సాధ్యమయ్యేది కాదు. ఏదేమైనా 2017లో గ్యారీక్ హిలేమాన్, మిచెల్ రౌచ్‌ సైంటిస్ట్‌ల అధ్యయనంలో దీనికి పరిష్కారం దొరికింది. దీంతో ఏటా 232 మెగావాట్ల వినియోగం అవుతుందిన వాళ్లు లెక్కకట్టారు. ప్రస్తుతం డి వ్రీస్ అంచనాల ప్రకారం, బిట్‌కాయిన్ మైనింగ్ ఖర్చులలో దాదాపు 60% విద్యుత్ ఖర్చులకే పోతుంది. ఉదాహరణకు.. జనవరిలో, ఒక బిట్‌కాయిన్ ధర $ 42,000 ఉంటే ఈ రేటు ప్రకారం, మైనర్లు సంవత్సరానికి సుమారు $ 15 బిలియన్లు సంపాదిస్తారు. ఈ ఆదాయంలో 60% విద్యుత్ కోసం చెల్లించాల్సి ఉంటుంది, కిలోవాట్ గంటకు $ 0.05 ధరతో, మొత్తం నెట్‌వర్క్ సంవత్సరానికి 184TWh వరకు వినియోగించవచ్చు అని డి వ్రైస్ తన అధ్యయనంలో వెల్లడించారు. అయితే184TWh శక్తి వినియోగానికి 90.2 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ఫుట్‌ప్రింట్(CO2) ఉత్పత్తి అవుతుంది. అంటే ఇది లండన్ ఉత్పత్తి చేసే కార్బన్ ఉద్గారాలతో సమానం.

మరిన్ని నష్టాలు :

క్రిప్టోకరెన్సీ మైనింగ్ ప్రభావాలు తరచుగా ఆర్థిక వ్యవస్థలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. మైనర్లు కొత్త బ్లాక్‌చెయిన్‌లను రూపొందించడానికి గంటల తరబడి హైటెక్ కంప్యూటర్‌లను ఉపయోగించడంతో, ఈ యంత్రాలు ఎక్కువ కాలం ఉండవు. ఈ యంత్రాలను ఉత్పత్తి చేయడానికి బిట్‌కాయిన్ మైనింగ్ పరికరాల తయారీదారులకు గణనీయమైన సంఖ్యలో చిప్స్ అవసరం ఇటీవల, కోవిడ్ -19 సంక్షోభ సమయంలో, ప్రపంచం ఈ చిప్‌ల కొరతను చూసింది. ఈ కొరత, ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది.

అటువంటి 1 మిలియన్ కంప్యూటర్లను ఉత్పత్తి చేయడానికి, అతిపెద్ద ప్రొవైడర్, బిట్‌మైన్ అవసరం కాగా అటువంటి అధిక-శక్తి సిలికాన్‌ను ఉత్పత్తి చేయగల చిప్ ఫ్యాబ్రికేటర్‌ను ఒక నెలపాటు ఉపయోగించాలి. ఇది కాకుండా అణు సామర్థ్యాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడానికి విధించిన ఆర్థిక ఆంక్షలను తప్పించుకోవడానికి ఇరాన్ వంటి దేశాలు క్రిప్టోకరెన్సీని ఉపయోగిస్తున్నాయి. ఇరాన్‌లో మైనింగ్ కార్యకలాపాలు ఇప్పుడు బిట్‌కాయిన్ నెట్‌వర్క్‌లోని మొత్తం కంప్యూటేషన్‌లో 8 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయని డి వ్రైస్ రాశారు. ఆదాయాన్ని పెంచడానికి దేశం బిట్‌కాయిన్‌ను ఉపయోగిస్తోంది, అయితే చమురు ఎగుమతులు అంతర్జాతీయ ఆంక్షలతో సంక్షోభం చెందుతున్నాయి.

పరిష్కారం :

లావాదేవీలను ధ్రువీకరించే విధానానికి, బిట్‌కాయిన్ ఇతర కంప్యూటింగ్-ఇంటెన్సివ్ సిస్టమ్‌లను ఉపయోగించగలిగితే, ఈ-వ్యర్థాల సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తుండగా, డిజిటల్ కరెన్సీ ధరలను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వాలు డిజిటల్ అసెట్ మార్కెట్‌ల నుంచి క్రిప్టోకరెన్సీలను కూడా నిషేధించడం కూడా మరో మార్గమని చెబుతున్నారు.

Advertisement

Next Story