నా చర్మంపైనే ఎందుకు చర్చ?: బిపాసా

by  |
నా చర్మంపైనే ఎందుకు చర్చ?: బిపాసా
X

హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ తమ ప్రొడక్ట్స్ నుంచి వైటెనింగ్, లైటెనింగ్, ఫెయిర్‌నెస్ పదాలను తొలగిస్తామని.. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరు కూడా చేంజ్ చేస్తామని ప్రకటించడంపై ఆ సంస్థను ప్రశంసించింది బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు. చిన్నప్పటి నుంచి కూడా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసి అలా ఎందుకు ఉండాలి? డార్క్ స్కిన్ ఉంటే మనుషులు కాదా? అనుకునే దాన్నని తెలిపింది బిపాసా. అమ్మ నల్లగా ఉన్నా అందంగా ఉండేదని.. నాకు అవే పోలికలు వచ్చాయని.. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో మాత్రం ఎప్పుడూ తన కలర్ గురించే మాట్లాడుకునే వారని చెప్పింది.

‘15-16 ఏళ్ల వయసులో మోడలింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కలర్ గురించే టాపిక్ నడిచేది. సూపర్ మోడల్ కాంటెస్ట్‌లో విన్ అయినప్పుడు కూడా డస్కీ గర్ల్ ( నల్ల పిల్ల) విన్ అయిందని ఒక టాగ్ యాడ్ చేశారు. అప్పుడు కూడా ఈ నల్ల అనే విశేషణం ఎందుకు అని? ఆ తర్వాత మోడలింగ్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు సైతం నాకున్న కలర్ వల్లే.. ఎక్కువ పని దొరికింది’ అని చెప్పింది.

బాలీవుడ్‌లో అడుగుపెట్టాక తొలి సినిమా సక్సెస్ టైమ్‌లోనూ ప్రేక్షకులను ఫిదా చేసిన డార్క్ బ్యూటీ అనే రాశారన్న బిపాసా.. నా చర్మం రంగు ఇతర హీరోయిన్ల నుంచి ఎందుకు వేరు చేయాలని అనిపించేదని గుర్తుచేసుకుంది. ‘నన్ను అందరిలో వేలెత్తి చూపించినట్లు అనిపించేది. కానీ ఆ కలర్ తనకు నచ్చిన పనులను చేసేందుకు ఆపలేదని’ తెలిపింది.

‘గత 18 ఏళ్లలో ఎన్నో బ్రాండ్‌లు తనను ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో నటించాలని పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేశాయి.. నేను మాత్రం నా ప్రిన్సిపుల్స్‌‌కు కట్టుబడే ఉన్నాను’ అని తెలిపింది బిపాసా. దేశంలో ఎక్కువ మంది నల్ల రంగులోనే ఉన్నప్పుడు.. ఎందుకు ఇలాంటి తప్పుడు కలలతో బ్రాండ్ యాడ్ రావాలి అనుకునేదాన్నని చెప్పింది. కలర్ అనేది లోతుగా పాతుకుపోయిన కళంకం అని.. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. హిందుస్థాన్ యూనిలివర్ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ విషయంలో గొప్ప నిర్ణయం తీసుకుందని.. అన్ని బ్రాండ్స్ కూడా అదే అడుగుజాడల్లో నడిస్తే బాగుంటుందని కోరింది.

https://www.instagram.com/p/CB4iGuCjjlE/?utm_source=ig_web_copy_link



Next Story

Most Viewed