వ్యాక్సిన్ తయారీలో… భారత్ మరో ముందడుగు

by  |
వ్యాక్సిన్ తయారీలో… భారత్ మరో ముందడుగు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నం అయ్యాయి. భారత్‌లోనూ వ్యాక్సిన్ తయారీకి ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ.. ఇటీవలే నిమ్స్‌లో రెండోదశ ట్రయల్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో భాగంగానే భారత్‌ బయోటెక్‌ మరో ముందడుగు వేసినట్టు తెలిపింది. జంతువులపై కొవాగ్జిన్‌ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని వెల్లడించింది.

వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. వ్యాక్సిన్‌తో ఎలాంటి ప్రతికూల ప్రభావం కలగలేదని పేర్కొంది. రెండో డోస్‌ ఇచ్చిన 14 రోజుల తర్వాత పరిశీలించామని.. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ వృద్ధిని నియంత్రించినట్టు గుర్తించామని తెలిపింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా ఉందని సంస్థ పేర్కొంది.


Next Story

Most Viewed