- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో వీళ్లందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి.. లేదంటే ఇక మూడినట్టే
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం. కరోనాతో ఇప్పటి వరకు బయోమెట్రిక్ నిలిపివేసింది ప్రభుత్వం. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బయోమెట్రిక్ హాజరు తక్షణమే అమలులోకి వస్తుందని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలతోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల్లో కూడా బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరు నమోదు నెల వారీగా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి హాజరును బయోమెట్రిక్ ద్వారా ప్రతి శాఖ కార్యదర్శి పరిశీలించాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు.