- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ బయోబబుల్ అత్యంత హానికరమైంది : అడమ్ జంపా
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 నుంచి మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ అడమ్ జంపా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ తరపున ఆడుతున్న జంపా.. మొదటి విడత మ్యాచ్‌ల అనంతరం స్వదేశానికి వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పినా.. దేశంలో పెరుగుతున్న కరోనా ఆందోళన కారణంగానే వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో పలు విషయాలు అడమ్ జంపా పంచుకున్నాడు.
‘గత సీజన్ యూఏఈలో నిర్వహించినప్పుడు నేను చాలా సురక్షితంగా ఉన్నట్లు భావించాను. కానీ ఇప్పడు మాత్రం అలాంటి ఫీలింగ్ లేదు. ప్రస్తుతం తాను ఉన్న బయోబబుల్ చాలా హానికరంగా ఉన్నట్లు నాకు అర్దం అయ్యింది. నేను ఇండియాలో ఉన్నందుకే అలా ఫీల్ అయ్యానేమో నాకు తెలియదు. కరోనా సమయంలో మనం పరిశుభ్రత, సోషల్ డిస్టెన్సింగ్ గురించి మాట్లాడుతున్నాము. కానీ బయోబబుల్‌లో అలా లేదు’ అని జంపా చెప్పాడు. మన కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే ఐపీఎల్ చూస్తూ కూర్చుంటామా? దీన్ని ప్రజలను కరోనా ఆందోళనల నుంచి బయట పడేయడానికే అనడం హాస్యాస్పదం అని జంపా వ్యాఖ్యానించాడు.