- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టెన్త్ టాపర్..ఆన్‌లైన్ స్టడీకి నో స్మార్ట్‌ఫోన్!
by Shamantha N |

X
పాట్నా: బీహార్ రాష్ట్ర పదో తరగతి బోర్డు మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో రోహ్తా జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతు కొడుకు స్టేట్ టాపర్‌గా నిలిచాడు.కానీ, పై తరగతులకు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకునేందుకు అతనికి ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేదు. వాళ్లింట్లో ఉన్న ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్‌తో నలుగురైదుగురు కలిసి మార్చిమార్చి చదువుకుంటామని టాపర్ హిమాన్షు తెలిపాడు.లాక్‌డౌన్, పేదరికం కారణంగా తను ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు వివరించాడు. తన తండ్రి పొద్దంతా పొలాల్లో గడిపి సాయంత్రం తనకు చదువు చెప్పేవాడని తెలిపాడు. ఇంటర్‌లో సైన్స్ గ్రూపు తీసుకుని, పేరు గాంచిన ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడం తన కలగా హిమాన్షు చెప్పుకొచ్చాడు.
Next Story