- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కరోజే 5 వేల కరోనా కేసులు
న్యూఢిల్లీ: సుమారు రెండు నెలలుగా లాక్‌డౌన్ అమలవుతున్నా దేశంలో కరోనా కేసుల ఉధృతి మాత్రం తగ్గడం లేదు. అవి అంతకంతకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలోనే 5,242 కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో కేసులు గరిష్టంగా 5 వేలను దాటి నమోదవడం ఇదే మొదటిసారి. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు లక్షకు చేరువయ్యాయి. సోమవారం ఉదయానికి 96,169 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. ఈ వైరస్ నుంచి రికవరీ రేటు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. కరోనాతో విజయవంతంగా పోరాడి వైరస్ నుంచి బయటపడుతున్నవారి రేటు 38.29గా ఉన్నది. ఇప్పటి వరకు 36,824 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మనదేశంలో ఈ వైరస్‌తో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంగా మహారాష్ట్ర ఎప్పటిలాగే కొనసాగుతున్నది. ఈ రోజు ఉదయానికి ఈ రాష్ట్రంలో కరోనా కేసులు 33,053గా ఉన్నాయి. అంటే దేశంలోని మూడో వంతు కేసులు కేవలం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రం తర్వాత అత్యధిక కేసులు గుజరాత్(11,379), తమిళనాడు(11,224), ఢిల్లీ(10,054)లలో రిపోర్ట్ అయ్యాయి.