24 గంటల్లో 24వందల కరోనా కేసులు

by vinod kumar |
24 గంటల్లో 24వందల కరోనా కేసులు
X

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఒక వైపు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నా.. కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. సింగిల్ డేలో నమోదయ్యే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 2,411 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,776కు పెరిగింది. కాగా, కరోనా మరణాల సంఖ్య 1,223కు చేరింది. ఈ మహమ్మారి నుంచి 10,017మంది కోలుకున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.

tags: coronavirus, country, cases, single day, biggest

Next Story

Most Viewed