జాక్వెలిన్ నా హృదయం నీదే.. అభిమాని లేఖ!

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇటు సినిమాలు అటు ఆల్బమ్ సాంగ్స్‌తో బిజీ బిజీగా గడుపుతూ ఉంటుంది. కూల్‌‌ అండ్ జాయ్‌ నేచర్ గల జాక్వెలిన్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనే అభిమానులకు మెసేజ్ ఇస్తుంటుంది. చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని ఎంచుకోవాలని చెప్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ ఫన్‌గా కనిపించే జాక్వెలిన్.. తన లైఫ్ స్టైల్ ద్వారా చాలా మంది ఫ్యాన్స్‌ను ఇన్‌స్పైర్ చేసిందనే చెప్పొచ్చు. ఓ అభిమాని తనకు రాసిన లేఖ ఇందుకు ఉదాహరణ కాగా.. ఈ లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది జాక్వెలిన్. బిగ్గెస్ట్ ఫ్యాన్ శ్రేయ్ రాసిన ఈ లేఖ.. తనకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్పింది.

జాక్వెలిన్ తన లైఫ్‌లోకి వచ్చినందుకు థాంక్స్ చెప్పిన అభిమాని.. ‘నువు నా జీవితంలోకి వచ్చాకే చాలా హ్యాపీగా ఉన్నాను.. క్రేజీగా మారిపోయాను’ అని చెప్పాడు. అందమైన మనసున్న జాక్వెలిన్ తనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తుందని.. తనను ప్రకాశింపజేస్తుందని అన్నాడు. జాక్వెలిన్‌ను దేవుడిచ్చిన బహుమతిగా అభివర్ణించిన అభిమాని.. ‘నిన్ను భుజాల మీద మోయకపోయినా సరే, నా గుండెల్లో మాత్రం ఎప్పుడూ ఉంటావ్’ అంటూ తనపై ప్రేమను వ్యక్తం చేశాడు. లైఫ్‌లో నువ్వు ప్రేమించినట్లుగా, సపోర్ట్ చేసినట్లుగా మరెవరూ చేయలేదన్న శ్రేయ్.. తుఫాన్ తర్వాత వచ్చే రెయిన్‌బో మాదిరిగా తనను సంతోషంగా ఉంచుతున్నందుకు థాంక్స్ చెప్పాడు. ‘నా సపోర్ట్ సిస్టమ్’ నువ్వే అంటూ జాక్వెలిన్‌కు లవ్ యూ చెప్పాడు.

Advertisement