- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టుల్లో గంగూలీ, వన్డేల్లో ధోనీ గ్రేట్: గ్రేమ్ స్మిత్
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా కొన్నాళ్లు ఆడి ఉంటే భారత జట్టు మరికొన్ని ట్రోఫీలు గెలుచుకునేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ప్రస్తుత సీఎస్ఏ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో దాదా మంచి ఆటగాడని, కానీ, వన్డేల్లో మహేంద్రసింగ్ ధోనీ గొప్ప ఆటగాడని స్మిత్ చెప్పాడు. గంగూలీతో కలసి ధోనీ మరికొన్ని మ్యాచ్‌లు ఆడుంటే బాగుండేదని స్మిత్ అన్నాడు. మిడిలార్డర్‌లో ఆడటం వల్ల మహీ మ్యాచ్‌ను ముగించడంపై దృష్టి పెడుతున్నాడని, ప్రశాంతంగా ఉండటం అతనికి కలిసి వచ్చిందని అన్నాడు. ధోనీ లాంటి ఆటగాడు అతని కాలంలో ఎక్కువ సమయం ఉండుంటే టీమ్ ఇండియాను మరింత దృఢంగా మార్చేవాడని స్మిత్ చెప్పుకొచ్చాడు. నా వరకైతే టెస్టు క్రికెట్‌లో గంగూలీ, వన్డేల్లో ధోనీ ఉత్తమ ఆటగాళ్లని చెప్పాడు.
Advertisement
Next Story