నాకు ఏదైనా జరిగితే ఆ ఐదుగురుదే బాధ్యత.. విన్నర్ ప్రశాంత్ కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-12-21 15:20:20.0  )
నాకు ఏదైనా జరిగితే ఆ ఐదుగురుదే బాధ్యత.. విన్నర్ ప్రశాంత్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను.. పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్‌కు, మహావీరునికి బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ అనంతరం కోర్టు తీర్పు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్‌ను అరెస్ట్ చెయ్యక ముందే అతడు పరారీలో ఉన్నడని అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రశాంత్ తాను ఇంటి వద్దనే ఉన్నానంటూ.. ఏడికి పోలేదని ఓ వీడియో చేశాడు.

అందులో ‘పోలీసులు నన్ను ముందుగానే వెనుక గేటు నుంచి వెళ్లాలని చెప్పారు. కానీ నేను ట్రోఫీ అందుకొని ముందు గేటు వద్దకు వచ్చాను. అక్కడ నా కోసం చాలా మంది వచ్చారు. వారందరినీ చూసి షాక్ అయ్యాను. ఇంత మంది నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించిన వారిని కలవకుండా వెనుక గేటు నుంచి దొంగల వెళ్లడం సరైనది కాదని చెప్పి నేను వచ్చాను. అంతే కాదు.. నేను కప్పు గెలిచిన తర్వాత చాలా మంది నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అప్పటికే నాకు సరైన తిండి నిద్ర లేదు. కాస్త టైం ఇస్తే గంటలకొద్ది ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను. కానీ నేను ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంతో వారు నా గురించి కావాలనే నెగిటివ్‌గా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఐదుగురు వీడియోలు, ఫొటోలు మా వాళ్ల దగ్గర ఉన్నాయి. నేను అరెస్ట్ అయిన తర్వాత నాకు ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదు బాధ్యత అంటూ’ అరెస్ట్‌కు ముందు పల్లవి ప్రశాంత్ ఓ వీడియో చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండగా.. ఆ ఐదుగురు ఎవరు అని నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed