ఒక్కసారిగా శివాజీ శివతాండవం జిమ్‌లో వెయిట్స్‌ విసిరేస్తూ రచ్చ రచ్చ.. షాక్‌లో హౌస్‌మెట్స్

by Hamsa |   ( Updated:2023-09-14 05:56:12.0  )
ఒక్కసారిగా శివాజీ శివతాండవం జిమ్‌లో వెయిట్స్‌ విసిరేస్తూ రచ్చ రచ్చ.. షాక్‌లో హౌస్‌మెట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇటీవల బిగ్‌బాస్ సీజన్-7 స్టార్ట్ అయి వారం రోజులు అవుతోంది. ఇందులో కంటెస్టెంట్స్‌ పలు టాస్క్‌ల్లో పాల్గొంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. అలాగే రెండో వారం టాస్కులు, నామినేషన్స్ మంచి రసపట్టులో సాగుతున్నాయి.

ఈ క్రమంలో ‘బిగ్ బాస్’ హౌస్‌లో ప్రస్తుతం మాయాస్త్ర టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో విజేతగా నిలిచే సభ్యులకు పవర్ అస్త్ర లభిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా రిలీజైన మరో ప్రోమోలో.. బిగ్ బాస్’ ప్రిన్స్ యావర్కు పనిష్మెంట్ ఇచ్చాడు. తెలుగులో కాకుండా ఇంగ్లీష్, హిందీలో మాట్లాడుతున్నాడనే కారణంతో.. బిగ్ బాస్ ఆపమనేవరకు తెలుగులో క్షమాపణలు చెబుతూనే ఉండాలని తెలిపాడు. దీంతో ప్రిన్స్ గార్డెన్ ఏరియాలో ఆ టాస్క్ మొదలుపెట్టాడు. అయితే, కంటెస్టెంట్స్ ప్రిన్స్‌ను డిస్ట్రబ్ చేయడానికి ప్రయత్నించారు. ముందుగా టేస్టీ తేజా.. ప్రిన్స్‌ను టచ్ చేస్తూ అంతరాయం కలిగించే ప్రయత్నం చేశాడు. దీంతో శివాజీ.. ప్రిన్స్‌ను డిస్ట్రబ్ చేయొద్దని హౌస్‌మెట్స్‌కు చెబుతాడు. అయితే, శివాజీ మాటలను ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కొక్కరిగా వచ్చి ప్రిన్స్‌కు అంతరాయం కలిగించడం మొదలుపెట్టారు. దీంతో కంటెస్టెంట్లు తన మాట వినకుండా ప్రిన్స్‌ను డిస్ట్రబ్ చేస్తున్నారనే కోపంతో.. శివాజీ సైకోలా ఊగిపోయి జిమ్ ఏరియాలో ఉన్న వెయిట్స్‌ను పట్టుకుని గార్డెన్లోకి విసిరి పారేశాడు. దీంతో కంటెస్టెంట్లు షాకయ్యారు. మీద పడతాయని ప్రిన్స్‌కు దూరంగా ఉండిపోతారు.

Read More: పాన్ ఇండియా మూవీతో యూట్యూబర్ హర్ష సాయి హీరోగా ఎంట్రీ.. డబుల్ అప్డేట్స్

Advertisement

Next Story