Bigg Boss-7:రతిక ఎలిమినేట్‌పై షాకింగ్ ట్విస్ట్.. సీక్రెట్ రూమ్‌లోకి పంపించాలని రిక్వెస్ట్!

by Hamsa |
Bigg Boss-7:రతిక ఎలిమినేట్‌పై షాకింగ్ ట్విస్ట్.. సీక్రెట్ రూమ్‌లోకి పంపించాలని రిక్వెస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ నాలుగో వారం ప్రసారం అవుతోంది. వీకెండ్ ఎపిసోడ్ కొనసాగుతోంది. ప్రతివారం ఊహించని విధంగా ఎలిమినేషన్స్ అవుతుంటాయి. కొన్ని చిత్ర విచిత్రంగా ఉంటాయి. అయితే ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఒకరోజు ముందుగానే తెలిసిపోయింది. ఈ రోజు ఆదివారం (అక్టోబర్-1)న రతిక రోస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయనుందని సమాచారం.

ఈ క్రమంలో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. రతిక రోస్ అఫీషియల్ ఖాతాలో చేసిన ఓ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ‘‘రతిక ఎలిమినేట్ కానుందంటూ ఒక అప్‌డేట్ వచ్చింది. కానీ తను హౌస్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్. టాప్ 3లో ఉండేందుకు అర్హత ఉన్న కంటెస్టెంట్. అమర్ దీప్ లాంటి కొందరు నెగిటివ్ వ్యక్తుల వల్ల తను తప్పుడు దారిలో నడిచింది. ప్లీజ్.. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపించండి. తన వెనకాల ఏం జరుగుతుందో ఈ గేమర్‌కు తెలియనివ్వండి. ఎవరు తన మంచి కోరుతున్నారు? ఎవరు వాడుకుంటున్నారో? తనకు తెలియజేయండి. రతిక చాలా మంచి అమ్మాయి. అమర్‌దీప్ లాంటి వాళ్లు నిన్ను వాడుకున్నారు’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్యలో ఆయన ఎందుకు వచ్చాడంటూ ఫైర్ అవుతున్నారు. రతిక ఇన్‌స్టాగ్రామ్‌ను హ్యండిల్ చేస్తున్న వారికి ఇది బిగ్‌బాస్ రూల్స్‌కు విరుద్ధం అని కూడా తెలియదా అని కామెంట్లు చేస్తున్నారు. ఇంతలోనే ఈ పోస్ట్‌ను డిలీట్ చేశారు. కానీ స్క్రీన్ షాట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.



Advertisement

Next Story

Most Viewed