Bigg Boss Telugu 7: శివాజీ తేనె పూసిన కత్తి.. అతనికంత సీన్ లేదు.. మొత్తం కక్కేసిన సందీప్

by Prasanna |   ( Updated:2023-11-01 03:48:09.0  )
Bigg Boss Telugu 7: శివాజీ తేనె పూసిన కత్తి.. అతనికంత సీన్ లేదు.. మొత్తం కక్కేసిన సందీప్
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయిన సందీప్ మాస్టర్ మంచి పేరే తెచ్చుకున్నారు. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో 8 వారాలు నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్న తొలి కంటెస్టెంట్ గా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా .. తొలి హౌస్ మేట్‌గా ఐదు వారాలు ఇమ్యూనిటీ పొందుకున్న కంటెస్టెంట్ ఇతనే. నామినేట్ అయిన మొదటిసారే ఎవరు ఊహించని విధంగా ఎలిమినేట్ అయిపోయారు.దాదాపు 60 రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నారు. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తరువాత.. హౌస్ మేట్స్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సందీప్ మాస్టర్. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో తనలో కోణాన్ని చూపించారు. శివాజీ, అర్జున్‌లను అయితే ఒక రేంజ్ లో ఏకిపారేశారు. అలాగే టాప్ 3లో ఎవరు ఉండబోతున్నారో కూడా చెప్పాడు.

అర్జున్ ఇతను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా.. హౌస్లో నేను చాలా స్ట్రాంగ్.. నా అంత హైట్ ఇక్కడ ఎవడూ లేడు.. నా అంత తోపులు ఎవరు లేరని అనుకుంటున్నాడు. కానీ అన్నింటికీ కండబలమే కాదు.. బుద్ది బలం కూడా కావాలి. తనకి రెండు ఉన్నాయని అనుకుంటాడు కానీ.. అతనికి అంత సీన్‌లేదని చెప్పేసాడు.

నేనే ప్రశాంత్, యావర్‌లను కెప్టెన్‌ని చేశానని అపోహలో ఉన్నాడు శివన్న. అది ఖచ్చితంగా అపోహే. వాళ్ల సామర్ధ్యంతో వాళ్లు కెప్టెన్ అయ్యారు తప్ప.. ఈయన చేసేందేమీ లేదు. నన్ను ఓ ఫేక్ రీజన్‌‌తో కెప్టెన్సీ నుంచి పక్కకి తప్పించారు. తేనె పూసిన కత్తిలా మాట్లాడారు. 8 వారాల ఆటలో శివాజీ.. మొదటి రెండు వారాలు తప్పితే.. మిగిలిన ఆరు వారాలు ఏం ఆడాడు అంటూ ఏకిపారేసాడు. ఈ హౌస్‌లో అందరి కంటే ప్రియాంక చాలా మంచిది. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. టాప్ 3లో ప్రశాంత్, అమర్, ప్రియాంక ఉంటారని చెప్పాడు సందీప్.

Advertisement

Next Story