ఎలిమినేషన్‌పై మొదటిసారి స్పందించిన రతిక.. వాళ్లు అన్యాయం చేశారని సీరియస్

by Anjali |   ( Updated:2023-10-04 07:24:01.0  )
ఎలిమినేషన్‌పై మొదటిసారి స్పందించిన రతిక.. వాళ్లు అన్యాయం చేశారని సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-7లో పాల్గొన్న కంటెస్టెంట్లలో రతిక ఒకరు. ఈ బ్యూటీ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే ఎంతో యాక్టీవ్‌గా మాట్లాడుతూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కానీ, కొన్ని లక్షల మంది చూస్తున్న జడ్జిమెంట్ ప్రొగ్రామ్‌లో ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకోలేకపోయింది. కాగా, నాలుగో వారంలోనే రతిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే, రతిక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్స్’.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో చూసిన దాని కంటే మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది అని రతిక రాసుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే బిగ్ బాస్ తన ఎలిమినేషన్ విషయంలో తనకు అన్యాయం చేశారని ఈ సందర్భంగా ఈమె చెప్పకనే చెప్పేశారు. ఇక హౌస్లో తాను ఉండగా తనకి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ఈ సందర్భంగా ఈ బ్యూటీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More: మా ఇద్దరికి మంచిదే.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన మౌనిక రెడ్డి

Advertisement

Next Story