- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షకీలా కాళ్లపై పడి మరీ క్షమాపణలు చెప్పిన రతిక బేబీ.. ఫుటేజ్ కోసమే అంటున్న నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రసాకమవుతున్నా తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 దూసుకుపోతుంది. ఇంట్రెస్టింగ్ టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ షో స్టార్ట్ అయి రెండో వారం కూడా పూర్తి కావొస్తోంది. అయితే రెండో పవర్ ఆస్త్ర గెలుపు కోసం రణధీర టీమ్ అయిన శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, ప్రిన్స్ యావర్, షకీలా ఆరుగురు కంటెండర్స్ గా పాల్గొన్నారు. ఈ క్రమంలో గౌతమ్, ప్రిన్స్ మధ్య గొడవ జరిగింది. అయితే ఇదే సమయంలోనే తాను శివాజీ, ప్రిన్స్ యావర్‍కు మాయాస్త్రా భాగాలు ఇవ్వాలని చెప్పానని, అయినా మహాబలి టీమ్ వినలేదని గట్టిగా అరుస్తూ చెప్పింది రతిక. యావర్ కంటే షకీలా ఎలా అర్హురాలు అంటూ సొంత టీమ్‍పైనే చిందులేసింది. అంతేకాకుండా ఆమె ఎలా అర్హురాలు అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది.
ఆ తర్వాత రతికకు ఏమైందో తెలియదు కానీ రాత్రి షకీలా సిగరెట్ తాగుతున్న సమయంలో వెళ్లి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాను మన్నించండి అమ్మా అంటూ చెప్పింది. దానికి షకీలా నేను కూడా ఒసే పోవే అని మాట్లాడగలను. ఏం కాదు కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎలా అయినా అనొచ్చు. వెళ్లిపోవచ్చు. కానీ అది బ్యాడ్‌గా ఉంటుంది. చూసేవాళ్లకు బాగోదు అని చెప్పింది. దీంతో షకీలా రియాక్షన్‍కి రతిక వెంటనే కాళ్లు పట్టేసుకుంది. షకీలా కాళ్లు మొక్కి మరి క్షమించండి అంటూ వేడుకుంది. అయ్యో.. అలా ఏం వద్దు.. అంటూ లేపింది షకీలా. తర్వాత షకీలాను హగ్ చేసుకుంటూ మళ్లీ సారీ చెప్పింది రతిక. ఈ ఎపిసోడ్ చూసిన నెటిజన్లు కొంత మంది రతిక ఫుటేజ్ కోసం ఇలా సారీ చెప్పిందని అంటున్నారు.