Bigg Boss 7 Telugu: ఎలిమినేట్‌ అయినా సందీప్‌ మాస్టర్‌ రెమ్యునరేషన్‌.. ఎన్ని లక్షలో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-10-30 06:28:57.0  )
Bigg Boss 7 Telugu: ఎలిమినేట్‌ అయినా సందీప్‌ మాస్టర్‌ రెమ్యునరేషన్‌.. ఎన్ని లక్షలో తెలుసా?
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్‌బాస్ సీజన్‌ 7 లో ఎవరు ఉహించని విధంగా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. హౌజ్‌ లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా కొనసాగుతూ, టాప్‌-5 లో కచ్చితంగా ఉంటాడని అందరూ భావించారు. మొదటి వారం నుంచి అసలు నామినేషన్స్‌లోకి రాని సందీప్‌ మాస్టర్‌ హౌజ్‌ నుంచి బయటకు రావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన మొదటి వారంలోనే 5 వారాల పాటు ఇమ్యూనిటీ పవర్‌ దక్కించుకున్నాడు. తన అదృష్టం బాగుండి 6,7 వారాల్లోనూ మాస్టర్‌ నామినేషన్స్‌లోకి రాలేదు. ఒక్క వారం అయినా నామినేషన్స్‌లోకి వచ్చినట్లయితే ఓటు బ్యాంక్‌ ఎంత ఉందో తెలిసేది. అయితే ఇదే అతనికి మైనస్‌ గా మారిందని బిగ్ బాస్ ప్రేక్షకులు అంటున్నారు.

సందీప్‌ మాస్టర్‌ సుమారు ఎనిమిది వారాల పాటు బిగ్‌ బాస్‌ ఇంట్లో ఉన్నాడు.ఇంటి నుంచి బయటకు వెళ్తూ చాలా ఎమోషనల్‌ అయ్యాడు. అయితే ఎలిమినేట్‌ అయినా సందీప్‌ మాస్టర్‌కు రెమ్యునరేషన్‌ బాగానే అందినట్లు తెలుస్తోంది. వారానికి సుమారు రూ. .2.75 లక్షలు చొప్పున.. మొత్తం రూ.22 లక్షలు పైనే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇతర కంటెస్టెంట్లతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద అమౌంట్‌ అని చెప్పుకోవచ్చు.

Advertisement

Next Story