Bigg Boss 7 Telugu: వచ్చాక ఏం పీకావ్.. అంటూ భోలే మీద ఫైర్ అయిన అమర్ దీప్

by Prasanna |   ( Updated:2023-10-31 06:14:41.0  )
Bigg Boss 7 Telugu: వచ్చాక ఏం పీకావ్.. అంటూ భోలే మీద ఫైర్  అయిన అమర్ దీప్
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్‌బాస్‌లో నామినేషన్స్ వస్తేనే ఎవరి రంగు ఏంటో మొత్తం బయటపడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీకెండ్ వచ్చి నాగార్జున ఎంత చెప్పినా కొంతమంది పద్ధతి మాత్రం అసలు మార్చుకోవడం లేదు. గత వారం నామినేషన్స్‌లో భోలే మధ్యలో మాట్లాడాడని కుర్చీని తన్నేసి పగిలిపోద్ది అంటూ అమర్ దీప్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా మళ్లీ అమర్ దీప్ అలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఈవారం కూడా మరోసారి బూతుల పంచాగం విప్పాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా ఎవరికి అర్ధం కావడం లేదు.

నామినేషన్స్‌లో భాగంగా అమర్‌దీప్‌ని నామినేట్ చేస్తూ తన రీజన్ చెప్పాడు భోలే. గత వారం నేను మాట్లాడితేనే కుర్చీని భమ్ అని తన్నినవ్.. ఒక్క రీరికార్డింగే లేదు అక్కడ.. అసలు నాపైన కోపం తెచ్చుకోవాల్సిన అవసరం నీకేంటి తమ్ముడా అంటూ భోలే అడిగాడు. అలానే తర్వాత కప్పు కొడతా అన్నావ్.. దానికి నేనేం మాట్లాడను .. సూపర్ కొట్టుకో.. కప్పు వరకూ ఓకే కానీ మిగతాదంతా తప్పు అంటున్నా అని భోలే అల్లాడించాడు. దీనికి అమర్ రీజన్ చెప్పడం మానేసి.. మొన్న వీక్ నేను మిమ్మల్ని నామినేట్ చేశానని ఈ వారం రివెంజ్ నామినేషన్ వేశానంటూ అంటూ కవర్ చేశాడు. ఈ గ్యాప్ లో అమర్ దీప్ కోపంలో అక్కడే ఉంచిన మెట్టును బలంగా తన్నాడు. ఇది చూసి మళ్లీ నువ్వు ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నావని భోలే రైజ్ చేశాడు.

వచ్చీరాగానే మీరే నన్ను నామినేట్ చేసారు.. అమరం ఆన్సర్ ఇస్తే మరి నువ్వు అక్కడితో ఎందుకు ఆగిపోలేదు.. అంటూ భోలే కొశ్చన్ చేశాడు. వచ్చాక మీరు ఏం పీకారని.. మీరే ఆగాలి అంటూ అమర్ నోర్ జారాడు. పీకారా..అని భోలే అడిగితే, ఆ మాటకు అమర్ నోట నుంచి మాట కూడా రాలేదు.

Advertisement

Next Story

Most Viewed