- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 7 Telugu: మధ్యలో మాట్లాడితే పగిలిపోద్ది.. ప్రశాంత్‌పై అమర్ బూతుల బాగోతం
దిశ,వెబ్ డెస్క్: గౌతమ్‌ని నామినేట్ చేశాడు ప్రశాంత్.. ఇక తన రెండో నామినేషన్‌గా అమర్‌ని చేశాడు. భోలే అన్న ఆడలేదని నువ్వు ఎందుకు అన్నావ్.. ఆయన తన టీం కోసం ఆడాడు అని ప్రశాంత్ అన్నాడు. రేయ్ నేను ఆయన్ను అంటే మధ్యలో నీకేంట్రా నొప్పి.. అంటూ అమర్ ప్రశ్నించాడు. అయినా మా టీమ్ గురించి మీకెందుకబ్బా.. అంటూ భోలే మధ్యలో దూరాడు. దీంతో రెచ్చిపోయిన అమరదీప్ మధ్యలో మాట్లాడితే పగిలిపోద్ది.. అంటూ కుర్చీని గట్టిగా తన్నేశాడు.
ఇంతలో వెనకాల ఉన్న శోభా.. భోలేతో గొడవ పెట్టుకుంది. అమ్మా నేను నీతో అరవను.. నువ్వు కూర్చో అని భోలే అంటే.. అయినా అరవాలంటే గట్స్ ఉండాలి.. అంటూ శోభా పిచ్చిగా పిచ్చిగా మాట్లాడుతుంది. మధ్యలో గౌతమ్ అమర్‌ని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. దీంతో ఒక్కసారిగా కోపం తెచ్చుకున్న మన రైతు బిడ్డ అన్నా.. నీకు దమ్ముంటే ఈడకొచ్చి మాట్లాడు.. అలా గొణుక్కోవడం కాదు..అని అన్నాడు. నా ఇష్టం రా నేను ఎవరితోనైన మాట్లాడుకుంటా.. నీకెందుకు.. మూసుకొని కూర్చో పల్లవి ప్రశాంత్.. నువ్వు బిగ్‌బాస్‌వా నాకు నచ్చినోళ్లతో మాట్లాడుకుంటా.. నీతో మాట్లాడను.. నీతో నేను మాట్లడే అర్హత నీకు లేదు దొబ్బెయ్.. అంటూ గౌతమ్ నానా రచ్చ చేశాడు. ఇక ఆ తర్వాత అమర్ ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడాడు. చిన్న లాజిక్ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేని నువ్వు.. బిగ్ బాస్ కప్పు కొడతావా..? కలలు కనడం ఆపి.. ఇక నుంచైనా వాస్తవంలోకి రా అంటూ.. నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.