జబర్దస్త్ టు బిగ్ బాస్.. ట్రాన్స్‌‌ఉమన్ జర్నీ

by Anukaran |
sai-teja
X

దిశ, సినిమా : బిగ్ బాస్ తెలుగు ‘సీజన్ 5’ ఎంటర్‌టైన్‌మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆదివారం ప్రారంభమైన రియాలిటీ షోలో టీవీ సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ కలిపి మొత్తం 18 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరు భిన్న నేపథ్యాల నుంచి వచ్చినవారు కాగా.. వీరిలో జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్ @ సాయితేజ అందరి దృష్టిని ఆకర్షించింది. షో మొదటి రోజునే ఖైదీలతో కలిసి ఉండగలిగింది. మున్ముందు హౌస్‌లో మరింత డ్రామా ఉండబోతుండగా, ప్రియాంక గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

నాలుగో సీజన్‌లో మొదటిసారి ట్రాన్స్‌జెండర్ ఉమన్ తమన్నా సింహాద్రి షోలో పార్టిసిపేట్ చేయగా, ఇప్పుడు ప్రియాంక రెండో వ్యక్తి. కాగా పాపులర్ కామెడీ షో ‘జబర్తస్త్’లో సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగించిన తన జీవితంలో అనేక ప్రత్యేకతలున్నాయి. మొదట జబర్దస్త్‌లో ఫిమేల్ క్యారెక్టర్స్ చేయడానికి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నట్లుగా జెండర్ మార్పిడి చేసుకుని ధైర్యంగా నచ్చిన లైఫ్ లీడ్ చేస్తోంది. లింగమార్పిడి శస్త్ర చికిత్స తర్వాత హెల్త్ సమస్యలు చుట్టుముట్టడంతో అప్పడు ప్రియాంక తన ప్రాజెక్ట్‌లన్నీ పక్కనబెట్టాల్సి వచ్చింది. హార్మోనల్ ఇంబ్యాలన్స్, ఇతరత్రా సమస్యల నుంచి బయటపడేందుకు ఆమె ఫ్రెండ్స్ చాలా సాయం చేశారని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

తండ్రికి ఎమోషనల్ అప్పీల్..
ముగ్గురు తోబుట్టువుల్లో సాయితేజ అందరికంటే చిన్నవాడు. తను జెండర్ మార్చుకోవడాన్ని తల్లి ఒప్పుకున్నప్పటికీ తండ్రి నుంచి ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ స్టేజ్ నుంచి ‘నేను ఎప్పటికీ మీ తేజనే డాడీ.. అర్థంచేసుకుని అక్కున చేర్చుకోండి’ అంటూ ఎమోషనల్‌గా అభ్యర్థించింది ప్రియాంక. ఇక ఫార్మర్ జబర్దస్త్ జడ్జి నాగబాబు ఆర్థికంగా సాయం చేసినట్లు రీసెంట్ ఇంటర్వ్యూల్లో వెల్లడించిన ప్రియాంక.. తాను జీవితంలో స్థిరపడే వరకు ఆదుకుంటానని ఆయన హామీఇచ్చినట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed