బుల్లితెరపై నాగార్జున రోల్ ఇదే?

by  |
బుల్లితెరపై నాగార్జున రోల్ ఇదే?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు బుల్లితెర పై బాగా పాపులర్ అయిన బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ -4సీజన్ కు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామేర సినిమాలు, సీరియన్లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ -4పై నీలినీడలు కమ్ముకున్నాయి.

అసలు ఈసారి సీజన్ ఉంటుందా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ జరిగితే దానికి హోస్ట్‌గా ఎవరు వ్యవహరించనున్నారు. అందులోని పాత్రధారులు కొత్తగా ఎవరెవరినీ తీసుకోనున్నారు.. అనే ప్రశ్నలు అభిమానులకు గందరగోళానికి గురిచేశాయి.

ఫైనల్‌గా ఆ సందేహాలకు స్టార్ మా పులిస్టాప్ పెట్టింది. సీజన్ గురించి ప్రకటించడమే కాకుండా హోస్ట్‌గా నాగార్జునను తీసుకున్నట్లు ప్రకటించారు. తాజాగా దానికి సంబంధించి మరో వీడియో బుధవారం రిలీజ్ చేసింది స్టార్ మా. అందులో నాగార్జున ఓ వృద్ధుడి వేషంలో కనిపించారు. దీనిని చానల్ యాజమాన్యం సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత ఎం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్డ్ అంటూ యాజమాన్యం ట్వీట్ చేసింది.


Next Story

Most Viewed