- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరులో టీడీపీకి భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత..
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ కీలక నేత, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మున్వర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మున్వర్ తన అనుచరులతో కలిసి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మున్వర్‌కు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సీఎం వైయస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు టీడీపీ నేతలు సైతం ఆకర్షితులవుతున్నారని కొనియాడారు. ప్రజాక్షేత్రంలో నిలబడే దమ్ములేక టీడీపీ అనైతిక పొత్తులకు పాల్పడుతోందని విమర్శించారు. లోపాయికారి ఒప్పందాలతో కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఎన్ని పార్టీలతో టీడీపీ జతకట్టినా ప్రజలు మాత్రం వైసీపీ వెంటే ఉంటారని చెప్పుకొచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలో వైయస్ఆర్ సీపీదే విజయమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
- Tags
- anil Kumar