- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి సోదరుడు!
దిశ సంగారెడ్డి బ్యూరో: కాంగ్రెస్ ముఖ్య నేత, ఎన్నికల కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత తమ్ముడు రామచందర్ బీజీపీలో చేరనున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. చేరికలో భాగంగానే గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆయన ప్రత్యేకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరి మద్య చర్చలు జరిగినట్లు పార్టీ ముఖ్య నేతలు చెప్పారు. కాగా, త్వరలో జహీరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నది. ఆ సభలో రాంచందర్ అధికారికంగా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
రానున్న ఎన్నికల్లో ఆయన జహీరాబాద్‌లో పోటీ చేయడానికి రామచందర్ ఉత్సహంగా ఉన్నట్లు సమాచారం. అందుకే అక్కడే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను బీజేపీలోకి ఆహ్వానిస్తూ జహీరాబాద్‌లో ఫ్లెక్సీలు సైతం వెలిశాయి. ఇదిలా ఉండగా ఈ అంశం ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న దామోదర రాజనర్సింహకు ఈ పరిణామం పెద్ద షాక్ చెప్పుకోవచ్చు. 2018 ఎన్నికలకు ముందు దామోదర్ సతీమణి పద్మిని ఉదయం బీజేపీలో పార్టీలో చేరి సాయంత్రానికి తిరిగి సొంత కాంగ్రెస్ గూటికి చేరుకుంది. ఈ విషయంలో దామోదర్ ఇబ్బంది పడక తప్పలేదు. ఇప్పుడు తమ్ముడు పార్టీ మారడం దామోదర్‌కు పెద్ద తలనొప్పిగా మారనున్నదని స్పష్టమవుతున్నది.
Also Read...